24, మే 2016, మంగళవారం

రాయలసీమలోని సుప్రసిద్ద దేవాలయాలలో బోలికొండ రంగనాథ స్వామి క్షేత్రం ఒకటి. శేషతల్పంపై శయన ముద్రలో, నాయన మనోహరంగా దర్శనమిచ్చే దివ్యమంగళ స్వరూపుడు శ్రీ రంగనాథస్వామి. ఏడుకొండల వేంకటరమణుని వలే, అత్యంత మహిమాన్వితమైన స్వామిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని, భక్తిభావంతో తన్మయత్వం చెందుతుంటారు 
అనంతపురము జిల్లా గుత్తి పట్టణము నుంచి తాడిపత్రి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో " తొండపాడు " గ్రామం ఉంది. అ గ్రామ ప్రధాన రహదారి ప్రక్కనే ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగావున్న దారిగుండా సుమారు ఒక కిలోమీటరు దూరం కొండ ఎక్కి వెళ్తే కొండపైన స్వామి వారు స్వయంభువుగా వెలసిన  " బోలికొండ రంగనాథస్వామి " ఆలయం ఉంది.